: కుల్‌భూషణ్ జాదవ్ పై అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలపై యూఎన్ఎస్‌సీకి సమితి కార్యదర్శి లేఖ!
పాకిస్థానీ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం మధ్యంతర తీర్పు గురించి ఐక్యరాజ్య సమితి కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖ ప్రతులను అంతర్జాతీయ న్యాయస్థానంతో పాటు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్య దేశాలకు కూడా ఆయన పంపినట్లు సమాచారం. ఈ లేఖలో కుల్‌భూషణ్ కేసుతో పాటు మరో రెండు కేసులను కూడా ఆంటోనియో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య వివాదం, ఫ్రాన్స్, ఈక్విటోరియల్ గినియా దేశాల మధ్య వివాదాలను ఆయన లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. అయితే, ఆయనిలా లేఖ రాయడంలో ప్రత్యేకత ఏమీ లేదని, ఇది మామూలుగా జరిగే ప్రక్రియ అని అంటున్నారు.