: గుర్మీత్ కేసులో సంచలన తీర్పు చెప్పిన జడ్జి ఈయనే!
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిగిన కేసులో బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను దోషిగా తేలుస్తూ సంచలన తీర్పునిచ్చిన పంచకుల సీబీఐ న్యాయస్థానం జడ్జి పేరు జగ్దీప్ సింగ్. ఈయన 2000 సంవత్సరంలో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. రెండేళ్లు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు అనంతరం 2012లో హరియాణా జ్యుడిషియల్ సర్వీసుకు ఎంపికయ్యారు. జిల్లా అదనపు జడ్జిగా మొదట సోనేపట్‌లో బాధ్యతలు నిర్వహించారు. గతేడాది సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. జగ్దీప్‌సింగ్ చదువుకునే రోజుల్లోనే అనితర ప్రతిభ కనబరిచేవాడని, చాలా ఉదార స్వభావి అని అతని స్నేహితులు చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా ఒకసారి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉన్న వ్యక్తిని తానే స్వయంగా తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లిన సంఘటనను వారు గుర్తుచేస్తున్నారు.