nahachaitanya: చైతూ కోసం రంగంలోకి వెంకటేశ్ .. సమంతా .. అఖిల్!


'యుద్ధం శరణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి నాగ చైతన్య రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో చైతూను కొత్త లుక్ తో .. కొత్త కోణంలో చూపించనున్నారు. ఈ సినిమాను వచ్చే నెల మొదటివారంలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన ఆడియో వేడుకను నిర్వహించడానికి రెడీ అయ్యారు.

 రేవు సాయంత్రం ఈ సినిమా ఆడియో వేడుకను హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెన్షన్ లో జరపనున్నారు. ఈ ఆడియో వేడుకకు నాగ చైతన్య మేనమామ వెంకటేశ్ .. సమంతా .. అఖిల్ హాజరుకానున్నట్టు సమాచారం. వెంకటేశ్ .. సమంతా .. అఖిల్ .. ఈ ముగ్గురికీ కూడా మంచి ఫాలోయింగ్ వుంది. వాళ్ల రాకవలన ఈ సినిమా వైపుకు మరింతమంది దృష్టిని మళ్లించవచ్చనే ఆలోచనలో వున్నారు. ఇప్పటికే 'ప్రేమమ్' .. 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలతో సక్సెస్ ను అందుకున్న చైతూ, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.    

  • Loading...

More Telugu News