: గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఉపరాష్ట్రపతి... ఘనస్వాగతం పలికిన గవర్నర్, సీఎం
ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాక తొలిసారి వెంకయ్యనాయుడుకు తన స్వరాష్ట్రంలో పౌరసన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వెంకయ్య విమానం దిగగానే గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు లక్షమందితో భారీ మానవహారం ఏర్పాటు చేసి, ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. గన్నవరం నుంచి వెలగపూడిలోని సభా వేదిక వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.