: విమానం గాల్లో ఉండగా పైలట్‌కు గుండెపోటు.. ప్రాణభయంతో వణికిపోయిన ప్రయాణికులు.. హైదరాబాద్‌లో సేఫ్ ల్యాండింగ్!


విమానం గాల్లో ఉండగా పైలట్‌కు గుండెపోటు రావడంతో ప్రయాణికులు బిక్కచచ్చిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేవుడిని ప్రార్థించారు. వారి ప్రార్థనలు ఫలించి, విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. దోహా నుంచి రోమ్ వెళ్తున్న ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 పైలట్‌ ఒక్కసారిగా గుండెపోటుకు గురవడంతో అత్యవసర ల్యాండింగ్ కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించాడు. వారు అనుమతి ఇవ్వడంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో విమానంలో ఉన్న 225 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం పైలట్‌ను జూబ్లీహిల్స్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News