: శ్రీలంక జట్టుకు భారీ షాక్.. కెప్టెన్ తరంగపై సస్పెన్షన్ వేటు.. రెండు వన్డేలకు దూరం!


టెస్ట్ సిరీస్ కోల్పోయి, మరోవైపు వరుసగా రెండు వన్డేల్లోనూ పరాజయం పాలైన శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది. పల్లెకెలెలో భారత్‌తో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ ఉపుల్ తరంగపై రెండు వన్డేల సస్పెన్షన్ వేటు పడింది. ఇది వెంటనే అమల్లోకి రానుండడంతో భారత్‌తో జరగనున్న మిగతా మూడు వన్డేలలో రెండింటి నుంచి ఆయన తప్పుకోనున్నాడు. జట్టుకు కెప్టెన్ దూరం కావడంతో ఆయన స్థానంలో చమర కపుగెదెర తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

 కాగా, తరంగ ఇటీవల ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే కారణంతో రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌కు గురయ్యాడు. భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో చెత్త ప్రదర్శనతో అపకీర్తి మూటగట్టుకుంటున్న లంక జట్టుకు కెప్టెన్ దూరం కావడం శరాఘాతమేనని క్రీడా పండితులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News