: మరణశిక్ష విషయంలో రూటు మార్చిన ఫ్లోరిడా.. కొత్త లెథల్ ఇంజెక్షన్ ద్వారా శిక్ష అమలు!
మరణశిక్షల విషయంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం రూటు మార్చింది. తొలిసారిగా మూడు రకాల మందుల సమ్మేళనంతో కూడిన లెథల్ ఇంజక్షన్ ద్వారా గురువారం ఓ దోషికి మరణశిక్షను అమలు చేసింది. ఇద్దరు నల్లజాతీయులను హత్య చేసిన కేసులో శ్వేత జాతీయుడైన మార్క్ జేమ్స్ ఎస్సే (53)పై మోపిన నేరారోపణలు రుజువు కావడంతో కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. దోషికి ఈ ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే అతని పాదాలు కొట్టుకున్నాయి... ఆ వెంటనే అతని నోరు తెరచుకుంది.. క్షణాలలో అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.