: హైదరాబాద్‌ను ముంచేస్తున్న వాన.. నిన్నటి నుంచి ఏకధాటిగా కుండపోత.. జంక్షన్ల జామ్!


హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మొదలైన భారీ వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. మధ్యమధ్యలో చిన్నపాటి బ్రేకులిచ్చినా పూర్తిగా తెరిపినివ్వడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షానికి నగరం తడిసిముద్దైంది. అత్యధికంగా మాదాపూర్, బాలానగర్‌లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

నగరంలోని 30 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై మోకాలి లోతులో నీళ్లు కనిపిస్తున్నాయి. దీంతో వాహనాలు మొరాయిస్తున్నాయి. మరోపక్క ప్రధాన జంక్షన్లన్నీ జామయ్యాయి. నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల వినాయక మండపాలలోకి కూడా నీరు చేరింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

  • Loading...

More Telugu News