: కాకినాడ టీడీపీ నేతలకు అధిష్ఠానం షాక్.. పార్టీ నుంచి ఆరుగురు సస్పెన్షన్!
కాకినాడ టీడీపీ నేతలకు అధిష్ఠానం షాకిచ్చింది. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బీజేపీకి కేటాయించిన వార్డుల్లోనూ పోటీకి దిగిన టీడీపీ నేతలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా ఆ పార్టీకి సీట్లు కేటాయిస్తే, అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించి పోటీకి దిగడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోటీలో నిలిచిన బత్తుల గంగాభవానీ, ఉమా మహేశ్వరి, నాగమల్లిక, బుర్రా గంగా భవానీ, ఆదిలక్ష్మి, శీకోటి అప్పలకొండలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది.