: గుర్మీత్ కు మరో షాక్.. హింస నేపథ్యంలో ఆస్తులు అటాచ్ చేయాలంటూ హైకోర్టు ఆదేశం!


వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రాంరహీం సింగ్ బాబా విషయంలో కోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారం కేసులో ఆయనను దోషిగా తేలుస్తూ తీర్పు వెలువరించిన తర్వాత పంజాబ్, హరియాణాల్లో ఆయన అనుచరులు విధ్వంసం సృష్టించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మరో 200 మందికిపైగా గాయపడ్డారు.

 గుర్మీత్ అనుచరులు రైల్వే స్టేషన్లకు నిప్పంటించి ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి  పాల్పడడంతో పంజాబ్, హరియాణా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గుర్మీత్ అనుచరుల దాడిలో కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఆయన ఆస్తులను అటాచ్ చేయాలని ఆదేశించింది.  కాగా, అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌ను పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనకు గరిష్టంగా ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News