: ‘రాజుగారి గది-2’ టైటిల్ లోగో విడుదల!
అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో నటిస్తోన్న ‘రాజుగారి గది-2’ సినిమా లోగోను ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఈ నెల 29న విడుదల చేస్తామని సినిమా యూనిట్ తెలియజేసింది. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సమంత, సీరత్ కపూర్, వెన్నెలకిషోర్, అశ్విన్ కీలకపాత్రల్లో నటించారు. ఓంకార్ తీసిన ‘రాజుగారి గది-1’ సినిమాకు మంచి స్పందన రావడంతో ఇప్పుడు అటువంటి కథాంశంతోనే ‘రాజుగారి గది-2’ సినిమాను చిత్రీకరిస్తున్నారు. సమంత కూడా ఇందులో నటిస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి మరింత పెరిగింది.