: మ్యాన్‌హోల్‌లో పడ్డ వృద్ధురాలు.. రాత్రంతా అందులోనే గడిపిన వైనం!
ఓ వృద్ధురాలు (75) మ్యాన్ హోల్‌లో పడి అందులోనే 10 గంటలపాటు నరకయాతన అనుభవించిన ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. నిన్న రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఆమె.. మూత వేయకుండా ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. ఆ మ్యాన్ హోల్ 15 అడుగుల లోతు ఉంది. దీంతో రాత్రంతా ఆమె అందులోనే ఉండిపోయింది. ఈ రోజు ఉదయం మ్యాన్‌హోల్‌లో ఆమె ఉందని గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ వృద్ధురాలికి స్పల్పంగా గాయాలయ్యాయి.