: మంచి నిర్ణయం తీసుకుని మళ్లీ ఒక్కటవుతున్న నటుడు సుదీప్‌ దంపతులు!


తన భార్యకు విడాకులు ఇవ్వాల‌న్న నిర్ణ‌యం తీసుకున్న‌ కన్నడ నటుడు సుదీప్ వెన‌క్కుత‌గ్గాడు. పెళ్ల‌యిన 14 ఏళ్ల త‌రువాత ఆయ‌న‌ విడాకులు కోరుతూ 2015లో కోర్టును ఆశ్ర‌యించాడు. అయితే, కోర్టు విచారణకు మాత్రం సుదీప్‌, ఆయ‌న భార్య‌ ప్రియ చాలా సార్లు హాజరు కాలేదు. ఈ క్రమంలో తమ కూతురు సాన్వి కోసం మ‌ళ్లీ క‌ల‌వాల‌ని ప్ర‌స్తుతం సుదీప్ దంప‌తులు మంచి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది. ఫ్యామిలీ కోర్టులో వేసిన విడాకుల‌ పిటిషన్‌ను కూడా వారిరువురూ వెనక్కి తీసుకున్నారు. సుదీప్ దంప‌తుల‌ తరఫు న్యాయవాదులు బెంగుళూరు ఫ్యామిలీ కోర్టులో ఈ విష‌యం గురించి మీడియాకు వివ‌రించారు.      

  • Loading...

More Telugu News