: ఆ వార్తలతో కలత చెందిన ఐశ్వర్యరాయ్!
ఆధారాలు లేకుండా రాసిన ఓ వార్తతో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కలత చెందారని దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మీడియాకు చెప్పారు. ఆమె ప్రస్తుతం రాకేశ్ దర్శకత్వంలో ‘ఫ్యానీ ఖాన్’ సినిమాలో నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్‌కి జోడీగా నటుడు మాధవన్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. పలు పత్రికలు కూడా ఈ వార్తలను ప్రచురించడంతో ఆమె కలత చెందారని రాకేశ్ చెప్పారు. ఆ పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, ఆధారాలు లేకుండా రాశారని అన్నారు. ‘ఫ్యానీ ఖాన్’ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.