: హర్యానాలో కొనసాగుతున్న హింస.. 17 కి చేరిన మృతుల సంఖ్య
డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ దోషి అని హర్యానాలోని పంచకుల సీబీఐ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్యానాలోని పంచకులలో చెలరేగుతున్న హింసలో 17 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యాయి.
హర్యానాలోనే కాకుండా పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో కూడా ఆందోళనకారులు హింసకు పాల్పడుతున్నారు. ఢిల్లీలోని నగ్రి ప్రాంతంలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. యూపీలోని ఘజియాబాద్‌లోని ఓ ప్రాంతంలో ఆందోళనకారులు బస్సుకు నిప్పుపెట్టారు. తమ రాష్ట్రాల్లో చెలరేగుతున్న ఆందోళనలపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్ ద్వారా వివరించినట్లు తెలుస్తోంది.