: వైసీపీతో పొత్తు పెట్టుకుంటామన్న ప్రచారంలో వాస్తవం లేదు.. పొత్తులపై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది!: పురంధేశ్వరి
భారతీయ జనతా పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతులు కలుపుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. జగన్‌తో కలిసి వెళ్లాలన్న ఆలోచన తమ పార్టీకి లేదని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... కేంద్రం, రాష్ట్రంలో తాము టీడీపీతో కలిసి ఉన్నామని చెప్పారు. టీడీపీతో తమ పొత్తు కొనసాగుతుందని చెప్పారు. పొత్తులపై ఢిల్లీలోని అధినాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. వైసీపీ కూడా ఎన్డీఏలో కలవబోతోందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె ఆ విషయంపై స్పష్టతనిచ్చారు.