: వెయ్యి రోబోలు ఒకేసారి డ్యాన్స్ చేస్తే...గిన్నిస్ రికార్డే మ‌రి!... వీడియో చూడండి


ఒక్క రోబో డ్యాన్స్ చేస్తేనే `ఔరా!` అంటూ చూస్తాం. మ‌రి 1069 రోబోలు ఒకేసారి పాట‌ల‌కు స్టెప్పులు వేస్తే... ఇంకేముంది అది గిన్నిస్ రికార్డే! చైనాలోని డ‌బ్ల్యూ ఎల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీస్ వారు 1069 రోబోలతో ఒకేసారి స్టెప్పులు వేయించి గిన్నిస్ రికార్డు నెల‌కొల్పారు. ఈ రోబోల‌న్నింటికి `డోబీ` అని పేరు పెట్టారు. ఇవి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. కంపెనీ స‌రికొత్త టెక్నాల‌జీని చూపించుకోవ‌డానికి వారు ఈ ఫీట్ ప్ర‌ద‌ర్శించిన‌ట్లు తెలుస్తోంది. వ‌న్ గ్రూప్ కంట్రోల్ సిస్టం సాంకేతిక ప‌రిజ్ఞానం ద్వారా ప‌నిచేసే ఈ రోబోలు ఫుట్‌బాల్ కూడా ఆడ‌తాయ‌ని కంపెనీ తెలిపింది.

  • Loading...

More Telugu News