: ఎవరైనా అల్లాహ్‌ అక్బర్‌ అని అరిస్తే వాళ్లని కాల్చిపారేయండి: వెనిస్‌ మేయర్‌ లూగీ బ్రుగ్నారో


ఇటీవల బార్సిలోనాలో ఉగ్రవాదులు దాడికి పాల్ప‌డి 13 మంది ప్రాణాలను బలిగొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వెనిస్‌ మేయర్‌ లూగీ బ్రుగ్నారో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌ర‌యినా అల్లాహ్‌ అక్బర్‌ అని అరిస్తే వారిని వెంటనే కాల్చిపారేయండని అన్నారు. ఈ ఏడాది మార్చిలో వెనిస్‌లోని రియాల్టో బ్రిడ్జిని పేల్చేసిన ఉగ్ర‌వాదుల‌ను అక్క‌డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను హెచ్చరిస్తూ వారిని నేరుగా అల్లా దగ్గరకే పంపుతామని లూగీ బ్రుగ్నారో అన్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. బాధ్య‌త‌గ‌ల ప‌దవిలో ఉన్న వ్య‌క్తి ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.      

  • Loading...

More Telugu News