: పంజాబ్, హర్యానాల్లో విధ్వంసానికి పాల్పడుతున్న గుర్మీత్ బాబా భక్తులు
అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్, రాక్ స్టార్‌గా గుర్తింపు పొందిన బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ దోషి అని హర్యానాలోని పంచకుల సీబీఐ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో పంజాబ్, హర్యానాల్లో ఆయన భక్తులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. సీబీఐ కోర్టులో తీర్పు వెలువడిన వెంటనే ఆ కోర్టు ప్రాంగణం వద్ద ఉన్న మీడియా వాహనాలపై దాడి చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేన్లు, బాష్పవాయువును ప్రయోగించారు. పంజాబ్‌లో రైల్వేస్టేషన్లు, పెట్రోల్ బంకులకు ఆందోళనకారులు నిప్పు పెడుతున్నారు. ఆ రాష్ట్రంలోని బటిండా, మన్సా, ఫిరోజ్‌పూర్‌లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్ర ప్రజలు సంయమనం పాటించాలని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.