: ఆసుపత్రిలో వైద్యుడిని సర్జికల్ బ్లేడ్‌తో కోసి హత్య చేసిన దుండగుడు
ఆసుపత్రిలో వైద్యుడిని ఓ దుండగుడు సర్జికల్ బ్లేడ్‌తో కోసి హత్య చేసిన ఘటన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అలహాబాద్‌కు చెందిన సదరు వైద్యుడు శశ్వత్ పాండే (26) ఆసుపత్రిలోని ఓ రూమ్‌లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ హత్యను ఆ వైద్యుడి స్నేహితుడే చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పాండే గొంతును సర్జికల్ బ్లేడ్‌తో కోసేశారని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.