: ‘అర్జున్‌ రెడ్డి’ పాత్రకు స్టార్ హీరోను తీసుకుంటే అల్లు అర్జున్ సరిపోయేవారు!: దర్శకుడు సందీప్ రెడ్డి


విజయ్‌ దేవరకొండ హీరోగా కొత్త ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి తెర‌కెక్కించిన ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా ఈ రోజు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తోంది. తాజాగా సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... అర్జున్ రెడ్డి సినిమాను ఓ స్టార్ హీరోతో చేస్తే అల్లు అర్జున్ తో చేసేవాడిన‌ని అన్నాడు. అల్లు అర్జున్ ఈ పాత్ర‌కు స‌రిపోతార‌ని అన్నాడు. ఆయ‌న‌ను కలిసి ఈ కథ చెప్పే అవకాశం త‌న‌కు రాలేద‌ని తెలిపాడు. తాను ఆరేళ్ల ముందు అల్లు అర్జున్‌కి ఓ క‌థ చెప్పాన‌ని అన్నాడు. అయితే, ఆ సినిమాను మొద‌లు పెట్ట‌లేక‌పోయాన‌ని పేర్కొన్నాడు. అల్లు అర్జున్‌కి ఇప్పుడున్న‌ క్రేజ్‌ సాటిలేనిదని తెలిపాడు. తాను ఆయ‌న‌ను క‌లిసిన‌ప్పటిక‌న్నా ఇప్పుడు చాలా ఎదిగార‌ని తెలిపాడు.

  • Loading...

More Telugu News