: బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ సెంట్రల్ జైలుకి తరలింపు... తీవ్ర ఉద్రిక్తత
అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్, రాక్ స్టార్ బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ దోషేనని ఈ రోజు హర్యానా పంచకులలోని సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. బాబాకు కోర్టు ప్రాంగణంలోనే వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయనను హర్యానా పోలీసులు కస్టడీలోకి తీసుకుని జైలుకి తరలిస్తున్నారు. కాగా, సీబీఐ కోర్టు సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. బాబా భక్తులు ఈ తీర్పుని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనను అంబాలా సెంట్రల్ జైలుకి తరలిస్తున్నట్లు సమాచారం. దోషికి కనీసం ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడుతుందని న్యాయవాదులు భావిస్తున్నారు.