: అత్యాచారం కేసులో బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ దోషే: సీబీఐ కోర్టు సంచలన తీర్పు
డేరా స్వచ్ఛ సౌదా చీఫ్, రాక్ స్టార్ బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై నమోదైన అత్యాచారం కేసులో ఈ రోజు హర్యానా పంచకులలోని సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. బాబా దోషేనని సంచలన తీర్పునిచ్చింది. హర్యానాలోని పంచకుల సీబీఐ కోర్టుకి ఆయన భక్తులు భారీగా చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్, చండీగఢ్ రాష్ట్రాల్లో ఇప్పటికే హై అలర్ట్ విధించిన విషయం తెలిసిందే. ఈ నెల 28న గుర్మీత్ రామ్ రహీం సింగ్ బాబాకు శిక్ష ఖరారు చేయనున్నారు.