: వందకు పైగా వాహనాలతో సీబీఐ కోర్టుకు చేరుకున్న బాబా గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌.. సర్వత్ర ఉత్కంఠ!


డేరా సచ్చా సౌదా చీఫ్, రాక్‌ స్టార్‌ బాబా గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌పై నమోదైన అత్యాచారం కేసులో మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఈ క్రమంలో హర్యానాలోని పంచకుల సీబీఐ కోర్టుకి ఆయ‌న చేరుకున్నారు. బాబాకి వ్య‌తిరేకంగా కోర్టులో తీర్పు వ‌స్తే పంజాబ్, చండీగఢ్ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందోనన్న ఆందోళ‌న స‌ర్వ‌త్ర నెల‌కొంది. అప్ప‌ట్లో ఆయ‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లపై హైకోర్టు ఆదేశాల మేర‌కు సీబీఐ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు పూర్తి చేసింది. పంచ‌కుల‌లోని సీబీఐ కోర్టు వ‌ద్ద‌కు గుర్మీత్ అనుచరులు కూడా చేరుకున్నారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

  • Loading...

More Telugu News