: జల్సాలకు అలవాటు పడి మసాజ్ వ్యాపారంలోకి.. నష్టాలతో వ్యభిచారంలోకి.. దాసరి సిద్ధార్థ్ వాంగ్మూలం


స్పా కేంద్రాల పేరుతో పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు చిక్కిన ప్రధాన నిందితుడు దాసరి సిద్ధార్థ్ పోలీసుల విచారణలో ఆశ్చర్య పరిచే విషయాలు వెల్లడించాడు. జల్సాలకు అలవాటు పడి మసాజ్ వ్యాపారంలోకి వచ్చానని, నష్టాలు రావడంతో బయటపడేందుకు వ్యభిచారం బిజినెస్ లోకి దిగానని తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఐదు రోజుల క్రితం హైదరాబాదులోని మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలిలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న 12 స్పా కేంద్రాలపై పోలీసులు దాడులు చేసి సిద్ధార్థ్ సహా 19 మందిని అరెస్ట్ చేశారు. 65 మంది యువతులను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు. ఈ కేసులో చాలా విషయాలు గుర్తించామని, సిద్ధార్థ్ మొబైల్ కాల్ డేటాను విశ్లేషించిన తర్వాత స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.

దేశంలోని మూడు ప్రధాన మెట్రోపాలిటిన్ నగరాల్లోనూ అతడికి నెట్‌వర్క్ ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. ఈ దందాలో సిద్ధార్థ్‌ను మించిన వారు కూడా ఉన్నారని, వారికి ‘పెద్దల’ సహకారం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వ్యభిచారం విషయంలోనే కాక అనైతిక కార్యకలాపాలకు కూడా ఈ మసాజ్ కేంద్రాలు అడ్డాలుగా మారాయన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న థాయ్ యువతి, మరో ఇద్దరు వ్యాపార భాగస్వాములను అతి త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వివరించారు.
 

  • Loading...

More Telugu News