: ఆండ్రాయిడ్ ఓరియోలో బ్లూటూత్ సమస్యలు.... ఫిర్యాదు చేస్తున్న వినియోగదారులు
రెండ్రోజుల క్రితం గూగుల్ అధికారికంగా విడుదల చేసిన ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకున్నాక తమ స్మార్ట్ పరికరాల్లో బ్లూటూత్ సమస్యలు వచ్చినట్లు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆపరేటింగ్ సిస్టం వరకు బాగానే పనిచేస్తుంది కానీ, స్మార్ట్‌ఫోన్ సహాయంతో బ్లూటూత్ ఆధారంగా పనిచేసే పరికరాలకు తమ ఫోన్‌ను కనెక్ట్ చేయలేకపోతున్నట్లు వారు పేర్కొన్నారు. కనీసం బ్లూటూత్ స్పీకర్‌కి కూడా సరిగా కనెక్ట్ అవడం లేదని వారు తెలియజేశారు. ఈ సమస్యపై గూగుల్ ఇంకా అధికారికంగా ఎలాంటి చర్య తీసుకోలేదు.