: ‘ట్రంప్.. ప్లీజ్ మీరు ఓ డిక్షనరీ కొనుక్కోండి’ అంటున్న నెటిజన్లు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ట్విట్టర్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యూస్ ఛానెళ్లపై ట్విట్టర్ ద్వారా మండిపడుతూ వాటికన్నా ట్విట్టరే బెటరని కూడా గతంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే, అదే ట్విట్టర్ లో ఆయన చేస్తోన్న ట్వీట్లలో ఎన్నో స్పెల్లింగ్ మిస్టేక్స్ దొర్లుతున్నాయి. ఓ ట్వీట్‌లో too కి బదులుగా to అని రాశారు. ఓ సారి healకి బదులుగా heelఅని రాసుకొచ్చారు. మరోసారి కవరేజ్ అనే పదానికి స్పెల్లింగ్ తప్పుగా కౌఫెఫె అని రాశారు. కౌఫెఫె అంటే ఏంటో అర్థం కాక నెటిజన్లు తికమక పడ్డారు. ఇవేకాక చాలా ట్వీట్లలో ఆయన ఇటువంటి మిస్టేక్ లే చేశారు. దీంతో ఆయనకు నెటిజన్లు ఓ సూచన చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ట్రంప్ ఒక డిక్షనరీ కొనుక్కుని దగ్గర పెట్టుకోవాలని, అందులో చూసి స్పెల్లింగ్ లు తెలుసుకుని ట్వీట్లు చేయాలని అంటున్నారు.