: వివాదాస్పద బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఆశీస్సులు అందుకున్న కోహ్లీ వీడియో, ఫొటోలు హ‌ల్‌చ‌ల్!


అత్యాచారం ఆరోపణలు ఎదుర్కుంటున్న డేరా ‘స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్’ కేసులో ఈ రోజు సీబీఐ న్యాయ‌స్థానం తీర్పు ఇవ్వ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆ న్యూసే దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌న‌కు సంబంధించిన అన్ని అంశాల‌పై నెటిజ‌న్లు పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా 2016లో టీమిండియా ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, ఆశిష్ నెహ్రూ, విజయ్ దహియా ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్ల‌గా తీసిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

అందులో వారంతా స‌ద‌రు వివాదాస్ప‌ద బాబా ఆశీస్సులు తీసుకుంటున్నారు. టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సాధించిన విజయాల వెనుక తన పాత్ర ఉంద‌ని ప‌లుసార్లు చెప్పుకున్నారు. తాను ఇచ్చిన స‌ల‌హాల‌తోనే కోహ్లీ రాణిస్తున్నాడ‌ని అన్నారు. అంతేకాదు. బాక్స‌ర్ విజ‌యేంద‌ర్ సింగ్ కూడా తన శిష్యుడేన‌ని, త‌న‌ అశీస్సులు తీసుకున్న తర్వాతే రాణించాడ‌ని ఆ బాబా వ్యాఖ్య‌లు చేసేవారు.      

  • Loading...

More Telugu News