: కాకినాడలో రెబల్స్‌పై వేటు వేయనున్న టీడీపీ
త్వరలోనే కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వతంత్రులుగా బరిలోకి దిగిన రెబల్ అభ్యర్థులపై టీడీపీ వేటు వేయడానికి సిద్ధమైంది. మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబుతో పాటు మరికొంత మంది టీడీపీ నేతలు ఈ విషయమై భేటీ అయి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై బీజేపీ నేతలతోనూ ఫోన్‌లో మాట్లాడి, బీజేపీ రెబల్ అభ్యర్థులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, కాకినాడలోని తొమ్మిదో డివిజన్‌లో స్వతంత్ర్య అభ్యర్థి అప్పలకొండకు, తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని టీడీపీ నేతలు ప్రకటించారు.