: పుట్టపర్తిలోని పెద్దకమ్మవారిపల్లెలో ఉద్రిక్తత.. అధికారులు, గ్రామస్తులకు మధ్య తోపులాట


అనంతపురం జిల్లా పుట్టపుర్తిలోని పెద్దకమ్మవారిపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. హంద్రీనీవా భూసర్వే పనులను గ్రామస్తులు అడ్డుకోవడంతో గ్రామంలో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. పనులను అడ్డుకుంటున్న గ్రామస్తులను నిలువరించేందుకు అధికారులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News