: రాజకీయాల్లోకి తిరిగి రాకపై లగడపాటి సంచలన వ్యాఖ్యలు.. నంద్యాల ప్రజలు టీడీపీవైపే ఉన్నారన్న మాజీ ఎంపీ!


కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ రాజకీయాల్లోకి  పున:ప్రవేశంపై క్లారిటీ ఇచ్చేశారు. నంద్యాల ఉప ఎన్నికపై తన ఫ్లాష్ టీం చేసిన సర్వేపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ తనకు రాజకీయాలంటే ప్రాణమన్నారు. ప్రత్యేక పరిస్థితుల వల్లే తాను రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అయితే రాజకీయాల్లో లేకున్నా తన సర్వేలు మాత్రం కొనసాగుతాయన్నారు. తన వ్యాపకమే అదని, కాబట్టి రాజకీయాలపై తన విశ్లేషణలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా సర్వేలు జరిపిస్తానని చెప్పారు. ఇక నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలపై తాను చేయించిన సర్వేలో టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని తేలిందన్నారు. ప్రజా తీర్పు టీడీపీ వైపే ఉందన్నారు. అయితే ఏయే అంశాలు టీడీపీ గెలుపును ప్రభావితం చేశాయన్న విషయాన్ని మాత్రం చెప్పలేనన్నారు.  

  • Loading...

More Telugu News