: ప‌ట్టాలు త‌ప్పిన ముంబై లోక‌ల్ ట్రైన్‌!


అంధేరి-చత్రపతి శివాజి టెర్మినస్‌ లోకల్ ట్రైన్ ముంబైలోని ద‌క్షిణ మహీమ్ ప్రాంతం వ‌ద్ద ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం సంభ‌వించలేదు. రైలుకు చెందిన నాలుగు బోగీలు ప‌ట్టాలు త‌ప్పిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదం వ‌ల్ల ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్ల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతోంది. బోగీలను ప‌ట్టాల మీద నుంచి తొల‌గించ‌డానికి ముంబై రైల్వే సిబ్బంది సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్‌, కైఫీయ‌త్ ఘ‌ట‌నల త‌ర్వాత రైల్వేమంత్రి సురేష్‌ ప్రభు తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. త‌ర్వాత‌ ప్రధాని మోదీ వారించడంతో వెనక్కి తగ్గారు. అలాగే రైల్వే బోర్డు మాజీ చైర్మ‌న్ అశోక్ కుమార్ మిట్ట‌ల్ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News