: రాజ్యసభ సభ్యులుగా స్మృతీ ఇరానీ, అమిత్ షాల ప్రమాణ స్వీకారం
ఇటీవల గుజరాత్ అసెంబ్లీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీలు ప్రమాణస్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీరిద్దరితోనూ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం తర్వాత స్మృతీ ఇరానీ వెంకయ్యనాయుడు పాదాలకు అభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. పార్లమెంటేరియన్‌గా అమిత్ షా ఎన్నికవడం ఇదే తొలిసారి కాగా, స్మృతీ ఇరానీ ఎన్నికవడం ఇది రెండోసారి. ఎన్డీయే కూటమికి రాజ్యసభలో సరిపడినంత మెజారిటీ లేని కారణంగా వీరిద్దరూ రాజ్యసభకు ఎన్నికవడం మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీయే కూటమి బలం 100 దాటిన సంగతి తెలిసిందే.