: ప్రకాశం, ఒంగోలు, కడపలో కుమ్మేస్తున్న వర్షం.. పలు ప్రాంతాలు జలమయం
ప్రకాశం, ఒంగోలు, కడప జిల్లాలలో గత రాత్రి నుంచి వర్షం కుమ్మేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షానికి కమలాపురం-ఖాజీపేట మధ్యనున్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఈ వర్షం కారణంగా వినాయక చవితి ఏర్పాట్లకు అంతరాయం కలిగింది. కడపలోని ఎంజే కాలనీ, అక్కాయపల్లి, భాగ్యనగర్ కాలనీ, ఎస్‌నగర్, గౌస్‌నగర్, గంజికుంటకాలనీ, శంకరాపురంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.