: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ దంపతుల తొలి పూజ
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణేశ్ మండపాల వద్ద కోలాహలం నెలకొంది. లంబోదరుడి ఆలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. గణేశుడి మండపాల వద్ద పిల్లా, పెద్దలు సందడి చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ నరసింహన్ దంపతులు తొలి పూజ చేయనున్నారు. 57 అడుగుల మహాగణపతి శ్రీ చండీకుమార అనంత మహాగణపతి రూపంలో దర్శనమిస్తున్నాడు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. సికింద్రాబాద్‌లోని వినాయకుడి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక వాడవాడలా ఏర్పాటు చేసిన గణేశుడి మండపాల్లో కొలువు దీరేందుకు వివిధ రూపాల్లో ఉన్న పార్వతీ తనయుడు సిద్ధమయ్యాడు.