: నెల్లూరు జిల్లాలో విషాదం.. గణేశ్ మండపానికి డెకరేషన్ చేస్తుండగా షాక్.. ఇద్దరు దుర్మరణం


వినాయక చవితి వేళ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కొమ్మినేనిపల్లిలో ఏర్పాటు చేసిన గణేశుడి మండపానికి సీరియల్ బల్బులు అలంకరిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన యువకులను సత్యబాబు, హరీష్‌గా గుర్తించారు. ఈ ఘటనతో కొమ్మినేనిపల్లిలో విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News