: పాలకొల్లులో 54 అడుగుల మహా గణపతి.. విశేషంగా ఆకట్టుకుంటున్న లంబోదరుడు!


పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో మహా గణపతి కొలువుదీరాడు. రెల్లి యువజన సేన ఆధ్వర్యంలో 54 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సర్వం సిద్ధం చేశారు. నిలుచుని ఉన్న ఈ విగ్రహానికి ఓ వైపు శివుడు మరోవైపు పార్వతీదేవి తలలు ఉన్నాయి. తొమ్మిది రోజుల పూజల అనంతరం  అదే ప్రాంతంలోని కాలువల నీళ్లను వెదజల్లి నిమజ్జనం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 54 అడుగులు ఉన్న ఈ మహా గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News