: వాస్తవానికి కాకినాడ స్మార్ట్ సిటీ కాదు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
కాకినాడను స్మార్ట్ సిటీగా ప్రకటించారు కానీ, నిజానికి, అది స్మార్ట్ సిటీ కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కాకినాడలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్ తో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు జరగనున్న 48 వార్డుల్లో తాము తిరుగుతున్నామని, ఇక్కడి సమస్యలను ప్రజలు తమ దృష్టికి తెచ్చారని అన్నారు. స్మార్ట్ సిటీ కింద కాకినాడను ప్రకటించారే తప్పా, నిజానికి, ఇది స్మార్ట్ సిటీ కాదని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టలేదని, కేవలం రెండు కోట్లు మాత్రమే ఖర్చు చేశారనే ఆరోపణలు ప్రజలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.