: పల్లెకెలె వన్డే: ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా!
పల్లెకెలె వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో పడింది. భారతజట్టు ఆరో వికెట్లు కోల్పోయింది. కాగా, భారత జట్టు మొదటి వికెట్ పతనం 15.3వ ఓవర్ లో రోహిత్ శర్మ(54) ఔట్ అవడంతో మొదలైంది. ఆ తర్వాత 16.3వ ఓవర్ లో ధావన్ (49), 17.1వ ఓవర్ లో జాదవ్(1), 17.3వ ఓవర్ లో కోహ్లీ(4),17.5వ ఓవర్ లో రాహుల్(4), 19.3వ ఓవర్ లో పాండ్యా డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో ధోనీ 4 పరుగులతో, పటేల్ నాలుగు పరుగులతో కొనసాగుతున్నారు. 20.1 ఓవర్ ముగిసే సరికి భారతజట్టు స్కోర్..126/6. కాగా, వర్షం చాలా సేపు ఆటకు అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్‌ను 47 ఓవర్లలో 231 పరుగులకు కుదించారు.