: జగన్ వ్యాఖ్యలను ప్రస్తావించిన బోండా ఉమ.. చంద్రబాబుపై అంబటి తీవ్ర వ్యాఖ్యలు!
నంద్యాల ఉపఎన్నిక ముగిసినప్పటికీ, ఆ ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యల కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. నంద్యాల ఉపఎన్నికలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనే అంశంపై ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాల్గొన్నారు.
‘మంత్రి ఆదినారాయణరెడ్డి నిక్కర్ ఊడదీస్తానంటూ నాడు జగన్ చేసిన వ్యాఖ్యలు తప్పుకాదా? నిక్కర్ ఊడదీసి ఏం చూస్తారు?’ అని ఉమ అనడంతో అంబటి రాంబాబు రెచ్చిపోయారు. ‘మీకు చూపిద్దామనేమో! ఆదినారాయణరెడ్డి నిక్కర్ ఊడదీసి చంద్రబాబుకు చూపిద్దామని. ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి టీడీపీలోకి చంద్రబాబు తీసుకెళ్లారు కదా! అందుకని, నిక్కర్ ఊడదీయించి చంద్రబాబుకు చూపిద్దామని. జగన్ గారు చూడటానికి కాదు..’ అంటూ అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.