: పెంపుడు పిల్లులకు రూ.2 కోట్ల ఆస్తి రాసిచ్చిన మహిళ!


తాను పెంచుకుంటున్న రెండు పిల్లుల‌కు ఓ మ‌హిళ రెండు కోట్ల రూపాయ‌ల ఆస్తి రాసిచ్చిన సంఘ‌ట‌న అమెరికాలోని న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. ఇటీవలే ఆమె మృతి చెంద‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ మ‌హిళ తాను పెంచుకుంటున్న‌ పెంపుడు పిల్లులకు తాను చ‌నిపోయిన త‌రువాత త‌న ఆస్తిలో 3 లక్షల డాలర్లు (రూ.2 కోట్లు) ఇస్తున్నట్లు పేర్కొంది. మ‌రిన్ని వివ‌రాలు చూస్తే... ఎలెన్‌ ఫ్రే వోటర్స్  అనే మ‌హిళ‌కు ఎవ్వ‌రూ లేరు. ఆమె  ట్రాయ్‌, టైగర్ అనే రెండు పిల్లుల‌ను పెంచుకుంటోంది.

వాటిని సొంత పిల్లల్లాగే భావించింది. అయితే, వృద్ధాప్యంలో ఉన్న ఆమె... తాను చ‌నిపోతే త‌న పిల్లులను ఎవరు చూసుకుంటారని అనుకుంది. అందుకే వీలునామాలో ఇలా పిల్లుల‌కు రూ.2 కోట్లు రాసిచ్చింది. ఆ నగదుతో పిల్లులకు ఏ లోటూ రాకుండా చూసుకోవాల‌ని పేర్కొంది. ఆ పిల్లులను ఇప్పుడు  ఎలెన్‌ వైద్య సహాయకురాలు గ్రిజెల్‌ పెంచుకుంటుందని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News