: రేపు హైదరాబాద్ కు రానున్న నేపాల్ ప్రధానమంత్రి
భారత్‌లో ఐదు రోజుల పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా తన పర్యటనలో భాగంగా రేపు హైదరాబాద్‌కు రానున్నారు. రేపు మధ్యాహ్నం 2.10 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. తన పర్యటనలో భాగంగా షేర్ బహదూర్ దేవుబా ప్రధానంగా భారత్, నేపాల్ ల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాల పురోగతిపై చర్చలు జరుపుతున్నారు.