: ఆడపడుచులు చంద్రన్నకు ఇవ్వనున్న బహుమానంగా భావిస్తా: టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు
నంద్యాల ఉపఎన్నికల్లో 20 వేల మెజార్టీతో తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని, ఆడపడుచులు చంద్రన్నకు ఇవ్వనున్న బహుమానంగా ఈ గెలుపును భావిస్తామని ఏపీ మంత్రి, టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల ప్రజలు తమ పార్టీకి బ్రహ్మరథం పట్టారని, పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొనడం శుభపరిణామం అని, టీడీపీకి బాగా కలిసొచ్చే అంశమని అన్నారు. నంద్యాల ప్రజలు జగన్ కు ఓటుతో చెంపదెబ్బ కొట్టనున్నారని అభిప్రాయపడ్డారు.