: నా కవితలకు, షార్ట్ స్టోరీస్ కు మొదటి రీడర్ పవన్ కల్యాణే: రేణు దేశాయ్


చిన్నప్పటి నుంచి తనకు కవితలు, షార్ట్ స్టోరీస్ రాసే అలవాటు ఉందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను రాసిన కవితలను, షార్ట్ స్టోరీస్ ను నాడు పవన్ కల్యాణ్ చదివి, తన అభిప్రాయం వ్యక్తం చేసేవారని, ప్రోత్సహించేవారని ఆమె గుర్తుచేసుకుంది. మొదట్లో సోషల్ మీడియాలో తనకు ఖాతాలు లేకపోవడంతో తన కవితలు, షార్ట్ స్టోరీస్ ను పోస్ట్ చేయలేకపోయానని అన్నారు. అయితే, మూవీ బిజినెస్ ప్రారంభించాక తన పీఆర్ టీమ్ సోషల్ మీడియాలో అకౌంట్ ప్రారంభించడంతో 2014 నుంచి వాటిని పోస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. 2015లో తాను తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు చాలా కవితలు రాశానని, నాలుగైదు డైరీలు వాటితో నిండిపోయాయని అన్నారు.

  • Loading...

More Telugu News