: ‘పైసా వసూల్’కి యూ/ఏ సర్టిఫికెట్!
బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ చిత్రీకరించిన పైసా వసూల్ చిత్రంకి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని నటి ఛార్మి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నట్లు పేర్కొంది. కాగా, ఈ సినిమాలో బాలయ్య చేసిన ఫైట్స్, డ్యాన్స్ , చెప్పిన డైలాగ్స్ ను ట్రైలర్ రూపంలో ఇప్పటికే చూపించారు. ఆ ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా, తమ అభిమాన హీరో బాలయ్య సినిమా ప్రమోషన్ కోసం సాయపడుతున్న ఛార్మికి అభిమానులు కామెంట్ల రూపంలో కృతజ్ఞతలు చెబుతున్నారు.