: కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద 64 కేసులు వేసిన చరిత్ర దుష్ట కాంగ్రెస్ పార్టీది: ఎంపీ బాల్క సుమన్
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నిన్న గొడవ చేసింది వాళ్లు, కుర్చీలను విసిరింది వాళ్లు. కాంగ్రెస్ చేస్తున్న డ్రామాలో ఈ గొడవ ఒకటి. ప్రాజెక్ట్ లు నిర్మించడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. ప్రాజెక్ట్ నీళ్లు రావొద్దని..వలసలు ఆగొద్దనేది కాంగ్రెస్ ఆలోచన. అసెంబ్లీలో నాడు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రభుత్వ ఆలోచన ఏంటో సీఎం కేసీఆర్ చెప్పారు. ఆంధ్ర ప్రభుత్వం మన ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా తీర్మానం చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడతామంటే మాత్రం వారు ఆందోళనలు చేస్తారు! కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద 64 కేసులు వేసిన చరిత్ర దుష్ట కాంగ్రెస్ పార్టీది’ అంటూ బాల్కసుమన్ మండిపడ్డారు.