: ‘అర్జున్ రెడ్డి’ సినిమా థియేటర్లపై ఎవరైనా రాళ్లు విసిరితే బాధ్యత వహించబోను: వీహెచ్
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విడుదలకు సిద్ధమైన అర్జున్ రెడ్డి సినిమాపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదల కానున్న థియేటర్లపై ఒకవేళ ఎవరైనా రాళ్లు విసిరినా, దాడులు చేసినా దానికి తాను బాధ్యత వహించబోనని వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో ఉన్న ముద్దు సీన్‌లను వెంటనే తీసేయాల్సిందేనని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ని పట్టించుకోకుండా ఈ సినిమాలోని ఆ ముద్దు సీన్లను అలాగే ప్రదర్శిస్తే జరిగే పరిణామాలకు తనకు ఎటువంటి సంబంధమూ ఉండబోదని వ్యాఖ్యానించారు.