: ‘యుద్ధం శరణం’లో ‘ఆవేశం’ పాట విడుదల.. శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో నాగచైతన్య సందడి!
హైదరాబాద్‌లోని శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో యువ నటుడు అక్కినేని నాగచైతన్య సందడి చేశాడు. ఆయన నటిస్తోన్న ‘యుద్ధం శరణం’ సినిమాలోని ‘ఆవేశం నిన్నే ప్రాణం తీసేయ్ అంటుంటే.. చేసేయ్ సాహసం’ పాటను ఈ రోజు ఆ కాలేజీ విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచి స్పందన వచ్చిందని నాగచైతన్య పేర్కొన్నాడు. యుద్ధం శరణం సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. వారాహి చలన చిత్రం పతాకంపై రజని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో చైతూ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోంది.