: ‘మిషన్ భగీరథ’ రాష్ట్ర గౌరవానికి సంబంధించింది: సీఎం కేసీఆర్


మిషన్ భగీరథ పథకం రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని, ప్రభుత్వానికి జీవన్మరణ సమస్య అని.. ఈ పథకం లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, గుత్తేదారులు రాత్రింబవళ్లు పనిచేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. ‘మిషన్ భగీరథ’ పనుల పురోగతిపై ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యంతో రూ.43 వేల కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ విధంగా దేశంలో ఎక్కడా చేయడం లేదని అన్నారు. డిసెంబర్ నాటికి అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీరు చేరేలా వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు, ఇన్ టేక్ వెల్స్ తదితర నిర్మాణాలు పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News