: పొరుగుదేశాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రధాని మోదీని ప్రశంసించిన నేపాల్ ప్రధాని
ఐదు రోజుల పర్యటన నిమిత్తం భారత్ విచ్చేసిన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దూబ, భారత ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. పొరుగుదేశాలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చే ప్రధాని మోదీ విధానాలను హర్షిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అలాగే `సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్` పాలనావిధానాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
నేపాల్ ప్రధానిగా దూబ ఎన్నికైన తర్వాత మొదటి అధికారిక భారత పర్యటన ఇదే. ఈ సందర్భంగా ఇరు దేశాలు కొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల అనంతరం ఆయన హైదరాబాద్, తిరుపతి, బోధ్‌గయా ప్రాంతాలను కూడా సందర్శించనున్నారు.